Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

రైతులకు ఆధునిక సాగుపై శిక్షణ

Author SAMAJA HITHAM | 01 Sep 2026, 03:55 PM | TELANGANA
రైతులకు ఆధునిక సాగుపై శిక్షణ

రైతులకు ఆధునిక సాగుపై శిక్షణ

మహాదేవపూర్: కాళేశ్వరం రైతువేదికలో మంగళవారం ఆత్మ పథకం ఆధ్వర్యంలో రైతులకు వ్యవసాయ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రైతులు తమ అనుభవంతో పొందిన సాగు పరిజ్ఞానాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రకృతి సేద్యం, ప్రత్యామ్నాయ పంటలు, సమతుల్య ఎరువుల వినియోగం, చీడపీడల నివారణ, వాతావరణ మార్పులకు అనుగుణమైన సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు.

రైతులకు ఆధునిక సాగుపై శిక్షణ - Additional Image

అనంతరం క్షేత్ర సందర్శన చేపట్టి ప్రత్తి పంటలో ఆకుమచ్చ, రసం పీల్చే పురుగుల నివారణ చర్యలను వివరించారు. వరి పంటలో ఆశించే చీడపీడలను ముందుగానే గుర్తించి తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. రైతులు ఆధునిక సాంకేతికత, డిజిటల్‌ పద్ధతులను వినియోగించుకుని సాగు ఖర్చులు తగ్గించుకుని ఆదాయం పెంచుకోవాలని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బాపురావు, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి