Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

జియో-ట్యాగింగ్ ఏదీ?.. ఉపాధి డబ్బులేవి?.. ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు!

Author SAMAJA HITHAM | 31 Aug 2026, 06:09 PM | తెలంగాణ
జియో-ట్యాగింగ్ ఏదీ?.. ఉపాధి డబ్బులేవి?.. ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు!

జియో-ట్యాగింగ్ ఏదీ?.. ఉపాధి డబ్బులేవి?.. ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు!

(పలిమెల ఆగస్టు 31)
ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల పట్ల అధికారులు చూపిస్తున్న తీవ్ర అలసత్వంపై నిరసన వ్యక్తమవుతోంది. పలిమెల మండలం పంకెన గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి 155 ఇళ్లను మంజూరు చేసినప్పటికీ, ఇళ్లు పూర్తయి గృహప్రవేశాలు జరిగి నెలలు గడుస్తున్నా లబ్ధిదారులకు EGS డబ్బులు అందడం లేదు.
అధికారులు గ్రామ స్థాయికి వచ్చి EGS జియో-ట్యాగింగ్ ఫోటోలు తీయకపోవడం, సాంకేతిక కారణాల పేరిట ఫైనల్ బిల్లును MD అప్రూవల్ దగ్గర నిలిపివేయడంతో తీవ్ర అన్యాయం జరుగుతోందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల అప్పులు తెచ్చి ఇళ్లు కట్టుకున్న పేదలు వడ్డీలు కట్టలేక ఆర్థికంగా కుంగిపోతున్నారు.
ఈ విషయమై పంకెన గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు పాగె ప్రీతి (భర్త: జితేందర్) సోమవారం జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి కి వినతిపత్రం సమర్పించారు. అధికారులు వెంటనే స్పందించి జియో-ట్యాగింగ్ పూర్తి చేసి, రావాల్సిన EGS డబ్బులతో పాటు నిలిచిపోయిన ఫైనల్ బిల్లులను విడుదల చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు.

జియో-ట్యాగింగ్ ఏదీ?.. ఉపాధి డబ్బులేవి?.. ప్రజావాణిలో అధికారుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు! - Additional Image