Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

జీవో 97 రద్దు చేయాలి: బీఆర్‌ఎస్‌వీ

Author SAMAJA HITHAM | 31 Aug 2026, 05:15 PM | Politics
జీవో 97 రద్దు చేయాలి: బీఆర్‌ఎస్‌వీ

భూపాలపల్లి: పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జీవో నెం.97ను వెంటనే రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌వీ జిల్లా నాయకుడు కొల్లోజు దిలీప్‌కుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్‌ఎస్‌వీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. జీవో 97పై విద్యార్థుల్లో ఆందోళన నెలకొందని, ప్రభుత్వం మొండి వైఖరి వీడి నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. విద్యార్థుల డిమాండ్ల సాధన కోసం నిరంతరం పోరాడుతామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ నాయకులు బానోదు మహేశ్వర్, భూక్య హరీష్, అఖిల్, చింటూ, రాజు తదితరులు పాల్గొన్నారు.