మత్తు పదార్థాలు సేవిస్తే నిమిషాల్లో గుర్తింపు

మత్తు పదార్థాలు సేవిస్తే నిమిషాల్లో గుర్తింపు మల్హార్: మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు కొయ్యూరు పోలీసులు రాపిడ్‌ టెస్ట్‌ కిట్లతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొయ్యూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అనుమానంతో పలువురు యువకులకు పరీక్షలు చేయగా పెద్దతుండ్ల గ్రామానికి చెందిన మందపల్లి రాజు, కందుగుల శ్రీనివాస్‌లకు పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిపై ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొయ్యూరు ఎస్సై పి. మహేందర్‌కుమార్‌ తెలిపారు. మండలంలోని యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, స్వచ్ఛందంగా పోలీసులను సంప్రదిస్తే డీ-అడిక్షన్‌ కేంద్రానికి పంపించి అలవాటు మాన్పించేలా సహకరిస్తామని చెప్పారు. మత్తు పదార్థాలను రవాణా చేసే, విక్రయించే, నిల్వ చేసే వారిపై కఠిన చర్యలు...