నూతన డీఈఓగా ఎల్. లలిత బాధ్యతల స్వీకరణ
భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా నూతన విద్యాశాఖ అధికారిగా ఎల్. లలిత మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.