పట్టా భూమికి రక్షణ కల్పించాలి.. రైతుల ధర్నా

భూపాలపల్లి: తమ పట్టా భూమిని కాపాడాలని కోరుతూ టేకుమట్ల మండలం కుందనపల్లి గ్రామానికి చెందిన బోయ వాల్మీకి సామాజికవర్గ రైతులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. సర్వే నంబర్‌ 377/డీలో తమకు ఎకరం 9 గుంటల పట్టా భూమి ఉందని తెలిపారు. భూమిని సాగుకు సిద్ధం చేసుకుంటుండగా స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. అధికారులు స్పందించి తమ భూమికి రక్షణ కల్పించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.