చికెన్‌, మటన్‌ మానేయాల్సిందేనా? రాత్రి 14 గంటల గ్యాప్‌తో షుగర్‌ కంట్రోల్‌.. కొత్త అధ్యయనంలో కీలక విషయాలు

టైప్‌-2 డయాబెటిస్‌ ఉన్న మహిళల్లో ఆహారపు అలవాట్లతో పాటు భోజనం చేసే సమయాన్ని మార్చడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. లాక్టో-వెజిటేరియన్‌ ఆహారం తీసుకుంటూ రాత్రిపూట 14 గంటల గ్యాప్‌ పాటించిన మహిళల్లో HbA1c, బరువు, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ వంటి అంశాల్లో మెరుగుదల కనిపించింది. ఈ పరిశోధనను Nutrition & Diabetesలో ప్రచురించారు. 24 వారాల పాటు పరిశోధన భారత్‌లో నిర్వహించిన ఈ అధ్యయనంలో 25 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న 96 మంది టైప్‌-2 డయాబెటిస్‌ మహిళలు పాల్గొన్నారు. వారిలో 90 మంది 24 వారాల పరిశోధనను పూర్తి చేశారు. ఒక గ్రూప్‌కు సాధారణ...