అమ్మాయిలకు అదిరిపోయే స్కాలర్‌షిప్.. ఏటా రూ.1.50 లక్షల సాయం.. అక్టోబర్ 15 చివరి తేదీ!
ఇంటర్‌లో 75% మార్కులు.. కుటుంబ ఆదాయం రూ.6 లక్షల్లోపు ఉంటే చాన్స్ ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతిలో మంచి మార్కులు సాధించి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరాలనుకునే ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థినులకు Kotak Education Foundation అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. కోటక్ కన్య స్కాలర్‌షిప్–2026 కోసం అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఎంపికైన విద్యార్థినులకు కోర్సు పూర్తయ్యే వరకు ప్రతి ఏడాది రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఖర్చులు, ల్యాప్‌టాప్, పుస్తకాలు, స్టేషనరీ, ఇంటర్నెట్, రవాణా వంటి అవసరాలకు ఈ మొత్తాన్ని వినియోగించుకోవచ్చు. 🎓 అర్హతలు ఇంటర్ లేదా 12వ తరగతిలో కనీసం 75% మార్కులు లేదా సమానమైన...