నాగార్జునసాగర్‌లో మళ్లీ జల వివాదం.. ఏపీ నీటి విడుదలపై తెలంగాణ అభ్యంతరం
KRMB అనుమతి లేకుండానే ఏపీ 1,600 క్యూసెక్కుల నీరు విడుదల చేసిందన్న ఆరోపణలు ఏపీకి కేటాయించిన 10 టీఎంసీలు ఇప్పటికే వినియోగం తెలంగాణ వాటాలో 15 టీఎంసీలు.. ఎడమ కాలువ ద్వారా 1,000 క్యూసెక్కుల విడుదల సాగర్ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద మరోసారి నీటి వివాదం రాజుకుంది. కృష్ణా జలాల వినియోగం విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఉద్రిక్తత నెలకొంది. మే నెలలో జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) సమావేశంలో ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 15 టీఎంసీల నీటిని కేటాయించారు. ఏపీకి కేటాయించిన నీటిని ఇప్పటికే పూర్తిగా వినియోగించినట్లు తెలుస్తోంది. అయితే బోర్డు నుంచి అధికారిక...