వ్రతం చేశారు.. బంగారం మురికి కాలువలో పడేశారు!
పండగ పూట ఎంతో భక్తితో అమ్మవారికి అలంకరించిన బంగారు నగలను పొరపాటున పూలతో పాటు డ్రైనేజీ కాలువలో పడేసింది ఓ కుటుంబం. తీరా విషయం తెలుసుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించగా, వారు రంగంలోకి దిగి గంటలపాటు శ్రమించి ఆ నగలను వెలికితీసి అప్పగించారు. విశాఖపట్నంలోని గాజువాకలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. గాజువాక శ్రీనగర్‌కు చెందిన ఉడుముల రమేశ్, దివ్య దంపతులు ఈ నెల 21న అత్యంత భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి సుమారు 8 తులాల బంగారు ఆభరణాలతో అలంకారం చేశారు. ఆనవాయతీ ప్రకారం మూడు రోజుల పాటు నగలను అమ్మవారి వద్దనే...