సింగరేణి మండలానికి సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇవ్వాలి

- సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు.. ఖమ్మం ప్రతినిధి: ఆగస్టు, 24 : స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయిన, అటు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడి దశాబ్దాలు దాటుతున్న ఏజెన్సీ మండలంలో ఉన్న సింగరేణి మండలానికి ప్రభుత్వం నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రాజెక్టుల ద్వారా చుక్క నీరు రాలేదని సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగు త్రాగునీరు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి సిపిఎం సీనియర్ నాయకులు, బాజు మల్లయి గూడెం మాజీ సర్పంచ్ అమరజీవి కామ్రేడ్ కరపటి రాములు గారి 13వ వర్ధంతి సభ వజ్జా రామారావు అధ్యక్షతన జరగగా వ్యవసాయమే ప్రధాన...