ప్రేమ ఓడిపోయింది.. పైసా గెలిచింది: 69 ఏళ్ల వృద్ధుడిని పెళ్లాడిన యువతి!
ప్రేమించిన ప్రియుడిని కాదని, కోట్ల ఆస్తి ఉన్న 69 ఏళ్ల వృద్ధుడిని ఓ యువతి వివాహం చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కథనం ప్రకారం.. ఓ యువతి, యువకుడు కలిసి చదువుకుంటూ నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే ఇటీవల సోషల్ మీడియా ద్వారా 69 ఏళ్ల అవివాహితుడితో యువతికి పరిచయం ఏర్పడింది. ఆయనకు ఉన్న విలాసవంతమైన బంగ్లాలు, ఖరీదైన కార్లు, కోట్లాది రూపాయల ఆస్తికి ఆకర్షితురాలైన యువతి.. అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది.వయసులో భారీ వ్యత్యాసం ఉండటంతో కుటుంబ సభ్యులు తొలుత తీవ్రంగా వ్యతిరేకించారు. అయినప్పటికీ యువతి తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో చివరకు పెళ్లికి అంగీకరించారు. పెళ్లి మండపానికి ప్రియుడి ఎంట్రీ.. వివాహం జరుగుతున్న...