కేంద్రంపై సీజేపీ ఫైర్‌.. సెప్టెంబర్‌ 5న ఢిల్లీలో భారీ నిరసన

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదంటూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 5న ఢిల్లీలో భారీ శాంతియుత నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించింది. నీట్‌ పరీక్షల నేపథ్యంలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలు, పోలీసుల వేధింపులకు గురైన బాధితులతో కలిసి ఈ ఆందోళన నిర్వహించనున్నట్లు తెలిపింది.సెప్టెంబర్‌ 5న ఇండియా గేట్‌ నుంచి ఢిల్లీలోని నూతన పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ వరకు నిరసన ర్యాలీ కొనసాగుతుందని సీజేపీ వెల్లడించింది. జూలై 25న కేంద్రం ఇచ్చిన హామీలను నమ్మి దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలను విరమించుకున్నామని, అయితే ఇప్పుడు ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపించింది.కేంద్రం వైఖరి యువతను, బాధిత కుటుంబాలను మోసం చేయడమేనని...