ఆగస్టు 28 చంద్రగ్రహణం.. రక్షాబంధన్‌ రోజు రాఖీ కట్టవచ్చా?

హైదరాబాద్: ఆగస్టు 28న పౌర్ణమి రోజున పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. 2026లో సంభవించే రెండో, చివరి చంద్రగ్రహణం ఇదే. ఈ గ్రహణం రక్షాబంధన్‌ రోజున రావడంతో రాఖీ కట్టుకోవచ్చా? సూతకం ఉంటుందా? అనే సందేహాలు చాలామందిలో నెలకొన్నాయి. ఖగోళ శాస్త్ర సమాచారం ప్రకారం గ్రహణం ఆగస్టు 28న తెల్లవారుజామున ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రహణం సుమారు 5 గంటల 38 నిమిషాల పాటు కొనసాగుతుంది. పాక్షిక గ్రహణ దశ సుమారు 3 గంటల 18 నిమిషాలు ఉంటుంది. అయితే భారత్‌లో అన్ని ప్రాంతాల్లో గ్రహణం పూర్తిగా కనిపించదు. కొన్ని ప్రాంతాల్లో చంద్రుడు అస్తమించే ముందు గ్రహణంలోని కొంత భాగం కనిపించే అవకాశం ఉంది. రక్షాబంధన్‌ రోజున...