నెరవేరిన రామగిరి ఆర్.ఎం.పి,పి.ఎం.పీల కల
నెరవేరిన రామగిరి ఆర్ఎంపీ, పీఎంపీల కల
మంత్రి చొరవ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడి సహకారంతో భవన నిర్మాణానికి నిధుల మంజూరు.ఎన్నో ఏళ్లుగా రామగిరి మండల ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదురుచూస్తున్న భవన నిర్మాణ కల ఎట్టకేలకు సాకారమైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో పాటు మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ కృషితో భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు పనులు ప్రారంభం కావడంతో రామగిరి ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రామగిరి మండలం బేగంపేట్ ఎక్స్ రోడ్‌లోని మంథని బ్లాక్ కాంగ్రెస్ కార్యాలయంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్‌ను ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తిరుపతి యాదవ్‌లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్ల తమ కలను సాకారం చేసేందుకు చొరవ చూపిన మంత్రి శ్రీధర్ బాబుకు, నిధుల మంజూరులో సహకరించిన తిరుపతి యాదవ్‌కు వారు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కమాన్‌పూర్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎస్ అన్వర్, రామగిరి ఆర్ఎంపీ, పీఎంపీల అసోసియేషన్ అధ్యక్షులు బొద్దుల జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి గండి పైడయ్య, క్యాషియర్ సందీప్‌తో పాటు రామగిరి మండల ఆర్ఎంపీ, పీఎంపీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు