🏠 cms.vedasoftware.in
Watermark
Newspaper Logo
cms.vedasoftware.in | Date: 01 Sep, 2026 | Page: 1

భూగర్భ జలాల పెంపు కి జలసిరి పథకం.

భూగర్భ జలాల పెంపు కి “జలసిరి” పథకం.

ఎంపీడీఓ శైలజరాణి, సర్పంచ్ ప్రతిమ


భారత వాసి రామగిరి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నాపూర్ లో భూగర్భ జలాల పెంపుకే జలసిరి పథకమని ఎంపీడీఓ బద్రి శైలజ రాణి, సర్పంచ్ పల్లె.ప్రతిమ పీవీరావు అన్నారు. మంగళవారం రత్నాపూర్ గ్రామంలోని రామగిరి ఖిల్లా ప్రాంతంలోని మెగా పల్లె ప్రకృతి వనం ప్రాంతంలో రెండో ఫామ్ ఫండ్ నిర్మాణం పనులను సర్పంచ్ పల్లె ప్రతిమపీవీరావు, ఎంపీడీవో బద్రి శైలజా రాణి తో కలిసి ప్రారంభించారు. వి.బి.జి రామ్.జి ఉపాధి హామీ పథకం కింద ఈ నిర్మాణం జరుగుతుందన్నారు. 12 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతుతో నిర్మాణం జరుగుతుంది. రూ.1.27 లక్షల నిధులు మెటీరియల్ కొరకు కేటాయించారు. 260 మస్టర్లు కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి ఏ.పీ.ఓ వరకొల్ల.మౌనిక, ఉపాధి టి.ఏ మల్కా అఖిల, సెక్రటరీ గంగుల సంతోష్, ఫీల్డ్ అసిస్టెంట్ సందవేన జ్యోతి పాల్గొన్నారు.
🏠 Home