🏠 cms.vedasoftware.in
Watermark
Newspaper Logo
cms.vedasoftware.in | Date: 01 Sep, 2026 | Page: 1

అనారోగ్యంతో ఉన్న వారందరినీ అన్ఫిట్ చేయాలి.

అనారోగ్యంతో ఉన్న వారందరినీ అన్ ఫిట్ చేయాలి .

ప్రతినెల 2 మెడికల్ బోర్డులు నిర్వహించాలి.

టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన.

భారత వాసి రామగిరి మండలం పెద్దపల్లి జిల్లా రామగుండం అర్జీ త్రీ ఏరియా లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ గారి సూచనలతో యూనియన్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి గారి మరియు కేంద్ర నాయకత్వం ఆదేశాలతో
ఆర్ జి త్రీ ఏపీఏ ఉపాధ్యక్షులు నాగేల్లి సాంబయ్య గారి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం తెలియజేస్తూ మేనేజర్లకు మెమోరాన్ని ఇవ్వడం జరిగింది.సింగరేణిలో తీవ్ర అనారోగ్యాల బారిన ఉన్న కార్మికులను సైతం మెడికల్ ఇన్వాల్యుడేషన్ చేయడం లేదని దీంతో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని పేర్కొంటూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం అన్ని గనులలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కార్మికులందరి తో కలిసి ఓసిపి వన్ మేనేజర్ పాపయ్య గారికి ఏఎల్పి మేనేజర్ పెంచలయ్య గారికి ఓసిపి టు ఇన్చార్జి మేనేజర్ కాలేష గారలకు పిట్ సెక్రటరీలు మరియు నాయకులు కార్మికులతో కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. భూగర్భ గనుల్లో ఆరుగాలం శ్రమించి బొగ్గు ఉత్పత్తికి పనిచేస్తున్న క్రమంలో కార్మికుడు తీవ్ర అనారోగ్యాలకు మరియు ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని బార్డర్లో సైనికులకు ఇస్తున్న విలువను సింగరేణి కార్మికులకు సైతం అందజేయాలన్న సదుద్దేశంతో గతంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 15వేల పైచిలుకు కారుణ్య నియామకాలను మెడికల్ ఇన్వాల్యుడేషన్ ద్వారా ఇవ్వడం ద్వారా కార్మికులను ఆదుకున్న వారు అయ్యారని తెలిపారు. అప్పట్లో 70 శాతం నుండి 90 శాతం పైచిలుకు అన్ ఫీట్లు అయినప్పటికీ ఇంకా ఎక్కువ చేయాలని అప్పటి సంఘాలు ఏఐటియుసి ఐఎన్టియుసి నిరసన కార్యక్రమాలు చేపట్టారని వారు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా గెలిచిన తర్వాత క్రమం తప్పకుండా మెడికల్ బోర్డులు కూడా నిర్వహించలేకపోయారని, ఒకటి రెండు మెడికల్ బోర్డులు పెట్టినప్పటికీ వాటిలో అతి తక్కువ మందిని అన్ ఫిట్ చేసి కార్మికులకు తీరని అన్యాయం చేశారని పేర్కొన్నారు. కార్మికుల అనారోగ్యాలను పరిగణలోకి తీసుకొని ఇప్పటినుండి అయినా క్రమం తప్పకుండా నెలకు రెండు లేదా మూడు మెడికల్ బోర్డులు నిర్వహించి అనారోగ్య బారిన ఉన్న కార్మికుల అందరిని మెడికల్ అన్ఫిట్ చేసి ఆదుకోవాలని లేఖ ద్వారా వివరించగా టీబీజీకేస్ నాయకులు కార్మికులు కలిసి ఇచ్చిన వినతి పత్రాన్ని కంపెనీ చైర్మన్ గారికి పంపుతామని అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర కమిటీ నాయకులు దేవ శ్రీనివాస్ కేశవరావు ఈసంపల్లి రమేష్ పాశం శ్రీనివాస్ రెడ్డి గట్టు శ్రీనివాస్ శ్రీకాంత్ రావు ఫిట్ సెక్రటరీలు వివి గౌడ్ గీటుకు శ్రీనివాస్, పూర్ణాకర్, వేముల రవిశంకర్, చిప్ప సురేష్, పూర్ణాకర్ బుద్ధి ఉదయ్ దేవరకొండ తిరుపతి డివిజన్ నాయకులు అల్లం తిరుపతి చిలకపల్లి శ్రీనివాస్ పోతరాజు రవి పొన్నం సదానందం బండి బాబురావు కలిగిరి రవి పూతాటి అసిస్టెంట్ ఫీట్ సెక్రటరీలు వీరగోని సంతోష గౌడ్, కొప్పుల సురేష్, క్రాంతి యాదవ్ నాయకులు బర్ల సుధాకర్, పోయిల భూమయ్య పిట్టల సది, చుక్కల కుమార్ రమణారెడ్డి రాజశేఖర్ అభిలాష్ చంద్రయ్య రాజు రాజేశం సుగుణాకర్ రావు మోహన్, రమేష్, శ్రీనివాస్, గట్టయ్య, కిరణ్ ,రవి, వికాస్ శ్రీనివాస్ రెడ్డి పురుషోత్తం సుధాకర్, శ్రీకాంత్, సూర్య ప్రకాష్, సంజీవ్, వెంకటేశ్వర్లు ముజాఫర్ ఖాన్ రాజ్ కుమార్ తిరుపతి, మూగ శ్రీనివాస్ మల్లేష్ వెంగళరావు అశోక్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
🏠 Home