ఆర్జీ3లో ఉత్పత్తి రవాణా వివరాలు వెల్లడి
ఆగస్టు నెల బొగ్గు ఉత్పత్తి,రవాణా వివరాల వెల్లడి.
అర్జీ త్రీ జి.ఎం సుంకర మధుసూదన్.
ఏఎల్పి జి.ఎం కొలిపాక నాగేశ్వరరావు.
భారత వాసి రామగిరి
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రామగుండం అర్జీ త్రీ ఏరియా లో ఆగస్టు నెల బొగ్గు ఉత్పత్తి,రవాణా వివరాలను
రామగుండం అర్జీ త్రీ ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ కొలిపాక నాగేశ్వరరావు మంగళవారం స్థానిక జి.ఎం కార్యక్రమంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో బొగ్గు ఉత్పత్తి,రవాణా వివరాలను వెల్లడించారు. రామగుండం అర్జీ త్రీ ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్ మాట్లాడుతూ ఆగస్టు నెలలో రామగుండం అర్జీ త్రీ ఏరియాకు నిర్దేశించిన 2.30 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, 1.79 లక్షల టన్నులు అనగా 78 శాతం బొగ్గు ఉత్పత్తి, తో పాటు, కంపనీ షావల్స్ కు నిర్దేశించిన 08.00 లక్షల క్యూబిక్ మీటర్ల ఓ.బి(మట్టి) వెలికితీత లక్ష్యానికి గాను, 9.75 లక్షల క్యూబిక్ మీటర్లు అనగా 122 శాతం ఓ.బి (మట్టి) వెలికి తీయడం జరిగిందని,ఆఫ్ లోడింగ్ కు నిర్దేశించిన 13:00 లక్షల క్యూబిక్ మీటర్ల ఓ.బి లక్ష్యానికి గాను 9.26 లక్షల క్యూబిక్ మీటర్లు అనగా 71 శాతం మట్టిని వెలికి తీయడం జరిగిందన్నారు.అదే విధంగా 4.69 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేయడం జరిగిందన్నారు. తదుపరి గనుల వారిగా ఉత్పత్తి వివరాలను తెలియజేస్తూ ఆగస్టు నెలలో ఓ.సి.పి వన్ గనికి నిర్దేశించిన 0.30 లక్షల టన్నుల లక్ష్యానికి గాను, 1.03 లక్షల టన్నులు అనగా 343 శాతం,ఓ.సి.పి టూ గనికి నిర్దేశించిన 2.00 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 0.77 లక్షల టన్నులు అనగా 38 శాతం బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా లక్ష్యానికి అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయడానికి తగిన చర్యలు తీసుకుంటూ విధులు నిర్వహించాలని కోరారు.ఆగస్టు మాసంలో అధిక వర్షాలు కురిసి నందున ఉత్పత్తిలో కొంత వెనుకపడ్డామని, వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్త చర్యలను తూచ తప్పక పాటించాలని, ఉద్యోగులందరూ బాధ్యతాయుతంగా పనిచేస్తూ సింగరేణి సంస్థ నిర్దేశించిన లక్ష్యాలను భద్రత తో సాధించడానికి కృషి చేయాలన్నారు.
అనంతరం అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు మాట్లాడుతూ అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ కు ఆగస్టు నెలలో నిర్దేశించిన 15,300 టన్నుల లక్ష్యానికి గాను 14,576 టన్నులు బొగ్గు ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు. లాంగ్ వాల్ 3వ ప్యానెల్ సాల్వేజింగ్ పనులను పూర్తి చేసి సుమారు 145 చాకులను బయటకు తీయడం జరిగిందని, సాల్వేజింగ్ పనులను పూర్తి చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.4వ ప్యానల్ తయారీ పనులు కొనసాగుతున్నాయని, త్వరలోనే పనులు పూర్తి చేసి నిర్దేశించిన లక్ష్యాలను భద్రతతో సాధించడానికి ఉద్యోగులందరూ కృషి చేయాలన్నారు. అలాగే ఉద్యోగులు చాలా మంది గైర్హాజరు అవుతున్నారని, గైర్హాజరు కాకుండా విధులు సక్రమంగా నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమం లో ఎస్వోటు జి.యం లు యం.రామ్మోహన్, బండి సత్య నారాయణ, ఏరియా ఇంజినీర్ ఎ.ఉదయ భాస్కర్, ఐ ఇ డీజీఎం బి.టి.మురళీ కృష్ణ, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, డివై పియం యండి.ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.