🏠 cms.vedasoftware.in
Watermark
Newspaper Logo
cms.vedasoftware.in | Date: 01 Sep, 2026 | Page: 1

అర్జీ త్రీ లో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన

మెడికల్ బోర్డులు నిర్వహించి దరఖాస్తుదారులను అన్‌ఫిట్ చేయాలి.


నల్ల బ్యాడ్జీలతో టీబీజీకేఎస్ నాయకుల నిరసన.


టీబీజీకేఎస్ కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈసంపల్లి రమేష్.



భారత వాసి రామగిరి పెద్దపల్లి జిల్లా సింగరేణిలో ప్రతి నెల క్రమం తప్పకుండా మెడికల్ బోర్డులు నిర్వహించి,అనారోగ్యం తో మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులందరినీ అన్‌ఫిట్ చేయాలని డిమాండ్ చేస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి గారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా ఆర్జీ త్రీ ఏరియాలోని ఎస్ అండ్ పి సి విభాగం సెక్యూరిటీ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా టీబీజీకేఎస్ కేంద్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈసంపల్లి రమేష్ మాట్లాడుతూ సింగరేణిలో రద్దు చేసిన డిపెండెంట్ ఉద్యోగాల స్థానంలో గౌరవనీయులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కారుణ్య నియామకాలు ప్రవేశపెట్టారు.తద్వారా 13 వేల పైచిలుకు కార్మికులను మెడికల్ “ఇన్‌వ్యాలిడేట్” చేయడం జరిగింది. తద్వారా ఉద్యోగం కోరుకున్న వేలాది కార్మిక కుటుంబాలకు న్యాయం జరిగింది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో దరఖాస్తు చేసుకున్న వారిలో 70% కార్మికులు మాత్రమే మెడికల్ అన్‌ఫిట్ అవుతున్నారని కాంగ్రెస్ పార్టీ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సంఘాలు కార్మికుల ఎదుట మొసలి కన్నీరు కార్చాయి.ఎన్నికల్లో మేము గెలిస్తే దరఖాస్తు చేసుకున్న కార్మికులకు నూటికి నూరు శాతం మెడికల్ అన్‌ఫిట్ చేయిస్తామని, ప్రతి నెల కనీసం మూడు మెడికల్ బోర్డులు నిర్వహిస్తామని హామీల వరద సృష్టించారు. ఆచరణలో 10 శాతానికి మించి మెడికల్ అన్‌ఫిట్ జరగడం లేదు.మెడికల్ బోర్డు ఎప్పుడు నిర్వహిస్తారో అని ఎదురు చూడటంలో కార్మికుల సర్వీసు పూర్తి అవుతున్నది.ఇప్పటి కైనా దరఖాస్తు చేసి మెడికల్ బోర్డు కోసం ఎదురుచూస్తున్న కార్మికుల కుటుంబాల భవిష్యత్తు దృష్ట్యా నిరంతరాయంగా మెడికల్ బోర్డు నిర్వహించి రోగాలతో బాధపడుతున్న వారందరినీ మెడికల్ ఇన్‌వ్యాలిడేట్ చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం జమేదార్ పిల్లి కుమార స్వామికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది.ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బ్రాంచ్ సెక్రటరీ పొన్నం సదానందం, షిఫ్ట్ ఇంచార్జ్ పలిగిరి హరికిరణ్, టిబిజికెఎస్ సీనియర్ నాయకులు రమణ రెడ్డి, గుడిసెల రాజశేఖర్, మామిడాల లక్ష్మీ రాజం, అజ్మీరా రాజేశం , రామగిరి శ్రీనివాస్, సంజీవ రావు, ముజఫర్ ఖాన్, గొట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home