చికెన్, మటన్ మానేయాల్సిందేనా? రాత్రి 14 గంటల గ్యాప్‌తో షుగర్ కంట్రోల్.. కొత్త అధ్యయనంలో కీలక విషయాలు
టైప్-2 డయాబెటిస్ ఉన్న మహిళల్లో ఆహారపు అలవాట్లతో పాటు భోజనం చేసే సమయాన్ని మార్చడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. లాక్టో-వెజిటేరియన్ ఆహారం తీసుకుంటూ రాత్రిపూట 14 గంటల గ్యాప్ పాటించిన మహిళల్లో HbA1c, బరువు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వంటి అంశాల్లో మెరుగుదల కనిపించింది. ఈ పరిశోధనను Nutrition & Diabetesలో ప్రచురించారు.
24 వారాల పాటు పరిశోధన
భారత్‌లో నిర్వహించిన ఈ అధ్యయనంలో 25 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న 96 మంది టైప్-2 డయాబెటిస్ మహిళలు పాల్గొన్నారు. వారిలో 90 మంది 24 వారాల పరిశోధనను పూర్తి చేశారు. ఒక గ్రూప్‌కు సాధారణ డయాబెటిస్ కేర్ అందించగా.. మరో గ్రూప్‌కు లాక్టో-వెజిటేరియన్ డైట్‌తో పాటు 14 గంటల టైమ్-రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ విధానాన్ని పాటించేలా చేశారు.
రాత్రి 14 గంటల గ్యాప్..
పరిశోధనలో పాల్గొన్న మహిళలు రోజులో 10 గంటల వ్యవధిలోనే ఆహారం తీసుకున్నారు. సాధారణంగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు భోజనం చేసి.. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం వరకు 14 గంటల పాటు ఆహారం తీసుకోలేదు. ఆహారంలో కూరగాయలు, పండ్లు, పప్పులు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, పీచు అధికంగా ఉండే పదార్థాలకు ప్రాధాన్యం ఇచ్చారు. మాంసం, చికెన్, చేపలు, గుడ్లను మినహాయించారు.
HbA1cలో గణనీయమైన మార్పు
24 వారాల తర్వాత ఈ విధానాన్ని పాటించిన గ్రూపులో HbA1c 6.53 శాతంగా నమోదైంది. సాధారణ డయాబెటిస్ కేర్ పొందిన గ్రూపులో ఇది 7.65 శాతంగా ఉంది. అంటే రెండు గ్రూపుల మధ్య 1.12 శాతం పాయింట్ల వ్యత్యాసం కనిపించింది. అలాగే బరువు, BMI, రక్తంలో గ్లూకోజ్, లిపిడ్ ప్రొఫైల్, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌లోనూ మెరుగుదల కనిపించింది.
చికెన్, మటన్ మానేస్తే షుగర్ రాదా?
అలా ఖచ్చితంగా చెప్పలేం. ఈ పరిశోధన ఇప్పటికే టైప్-2 డయాబెటిస్ ఉన్న మహిళలపై జరిగింది. ఇందులో కేవలం నాన్‌వెజ్ మానేయడం మాత్రమే కాకుండా వెజిటేరియన్ డైట్, 14 గంటల ఆహార విరామం, పోర్షన్ కంట్రోల్, న్యూట్రిషన్ కౌన్సెలింగ్, రెగ్యులర్ ఫాలోఅప్ వంటి అనేక మార్పులను ఒకేసారి అమలు చేశారు. కాబట్టి ఫలితానికి ఏ అంశం ఎంతవరకు కారణమైందో ఈ అధ్యయనం ద్వారా ప్రత్యేకంగా నిర్ధారించలేం.
అంతేకాదు.. ఈ పరిశోధన మహిళలపైనే, 24 వారాల వ్యవధిలో జరిగింది. పురుషులు, వృద్ధులు, ఇన్సులిన్ తీసుకునే డయాబెటిస్ రోగులకు ఇదే ఫలితాలు వస్తాయా అనేది నిర్ధారించేందుకు మరిన్ని అధ్యయనాలు అవసరం.