🏠 cms.vedasoftware.in
Watermark
Newspaper Logo
cms.vedasoftware.in | Date: 26 Aug, 2026 | Page: 1

నాగార్జునసాగర్‌లో మళ్లీ జల వివాదం.. ఏపీ నీటి విడుదలపై తెలంగాణ అభ్యంతరం

KRMB అనుమతి లేకుండానే ఏపీ 1,600 క్యూసెక్కుల నీరు విడుదల చేసిందన్న ఆరోపణలు
ఏపీకి కేటాయించిన 10 టీఎంసీలు ఇప్పటికే వినియోగం
తెలంగాణ వాటాలో 15 టీఎంసీలు.. ఎడమ కాలువ ద్వారా 1,000 క్యూసెక్కుల విడుదల
సాగర్‌ వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు వద్ద మరోసారి నీటి వివాదం రాజుకుంది. కృష్ణా జలాల వినియోగం విషయంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య ఉద్రిక్తత నెలకొంది. మే నెలలో జరిగిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) సమావేశంలో ఏపీకి 10 టీఎంసీలు, తెలంగాణకు 15 టీఎంసీల నీటిని కేటాయించారు. ఏపీకి కేటాయించిన నీటిని ఇప్పటికే పూర్తిగా వినియోగించినట్లు తెలుస్తోంది.

అయితే బోర్డు నుంచి అధికారిక అనుమతి లేకుండానే ఏపీ ఇరిగేషన్‌, జెన్‌కో అధికారులు కుడి కాలువ పవర్‌హౌస్‌ ద్వారా 1,600 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలంగాణ అధికారులు ఆరోపిస్తున్నారు.

తెలంగాణకు ఇంకా నీటి వాటా మిగిలి ఉండటంతో.. తాగునీటి అవసరాల దృష్ట్యా ఇరిగేషన్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ వాటాలో భాగంగా ఎడమ కాలువ ద్వారా 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

బోర్డు అనుమతి లేకుండా ఏపీ నీటిని విడుదల చేసిందన్న ఆరోపణలతో నాగార్జునసాగర్‌ వద్ద మరోసారి జల వివాదం తీవ్రరూపం దాల్చింది.
🏠 Home