🏠 cms.vedasoftware.in
Watermark
Newspaper Logo
cms.vedasoftware.in | Date: 25 Aug, 2026 | Page: 1

సింగరేణి మండలానికి సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇవ్వాలి

- సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు..

ఖమ్మం ప్రతినిధి: ఆగస్టు, 24 :
స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయిన, అటు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడి దశాబ్దాలు దాటుతున్న ఏజెన్సీ మండలంలో ఉన్న సింగరేణి మండలానికి ప్రభుత్వం నిర్మించామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రాజెక్టుల ద్వారా చుక్క నీరు రాలేదని సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగు త్రాగునీరు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి సిపిఎం సీనియర్ నాయకులు, బాజు మల్లయి గూడెం మాజీ సర్పంచ్ అమరజీవి కామ్రేడ్ కరపటి రాములు గారి 13వ వర్ధంతి సభ వజ్జా రామారావు అధ్యక్షతన జరగగా వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్న గిరిజన గిరిజనేతర పోడు వ్యవసాయ పేదలకు వర్షపు నీరు ఆ నీటితో నిండే చెరువులు,కుంటలు,బోర్లు, బావులు మినహా శాశ్వతమైన నీటి వనరులు లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి మండలం పట్ల నిర్లక్ష్య వైఖరిని ఆవలంబిస్తున్నాయని విమర్శించారు. సింగరేణి మండలానికి సంబంధించిన మధ్యతరగతి పేద రైతుల భూములను సీతారామ ప్రాజెక్టు కాలువలకు ఇస్తున్నప్పటికీ 2013 భూ నిర్వాసితులు చట్టాన్ని అమలుపరిచే పద్ధతిలో లేవని ఆ కాలువ ద్వారా చుక్క నీరు కూడా సింగరేణి మండల భూములకు రావని గుట్టని దాటించకుండా ఈ కాలవుల గుండా నీరు ఎలా వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో ఈ ప్రాంత భూములకు నీళ్లు ఇవ్వకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న విద్యా వైద్య సౌకర్యాలతో పాటు భూ సంబంధిత సమస్యలపై మరియు కరపటి రాములు ప్రజా ప్రతినిధిగా కమ్యూనిస్టుగా అనేక సౌకర్యాలు పోరాటాల కల్పనలో ముందుండి ప్రజల మనసు గెలుచుకున్న నాయకుడని కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యపరచి ప్రజా సమస్యలపై పోరాడటమే కరపటి రాములుకి ఇచ్చే నిజమైన నివాళి అని కామ్రేడ్ నున్న నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో పార్టీ డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మెరుగు సత్యనారాయణ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దుగ్గి కృష్ణ,కొండబోయిన నాగేశ్వరరావు, పార్టీ మండల కార్యదర్శి కే నరేంద్ర, ప్రజానాట్యమండలి నాయకులు కరకపల్లి రాయమల్లు,మండల కమిటీ సభ్యులు సురభాగ దనమ్మ యనమనగండ్ల రవి బాబు, శాఖ కార్యదర్శి సూరబాక సర్వయ్య, సోషల్ మీడియా కన్వీనర్ ధరావత్ వినోద్ కుమార్, పార్టీ సభ్యులు షేర్ వెంకటేశ్వర్లు, బచ్చల బుజ్జమ్మ, బచ్చల వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ కరపటి రంబాయమ్మ, భారత లక్ష్మి, బజ్జల వంశీకృష్ణ, ధరావత్ సరిత, కరపటి రాములు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home